News

If This Snake Bites Once 100 People Will Die This Is The Most Venomous Snake In The World

ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. అయితే విష సర్పాలంటే మనకు ముందుగా.. నాగు పాము, కట్ల పాము, నల్ల త్రాచు, రక్త పింజర పాములు గుర్తుకొస్తాయి. ఇలాంటి ప్రమాదకరమైన పాములు దేశం మొత్తం మీద సుమారు 200 వందలకు పైగా ఉన్నాయి. ఇవి కాటు వేస్తే.. సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. కానీ ఇంతకన్న ప్రమాదకరమైన పాములు ప్రపంచంలో ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రమాదకరమైన పాముకు సంబంధించిన ఓ వార్తే ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది. ఆ పాము ఒక్కసారి కాటు వేస్తే విడుదలయ్యే విష ప్రభావం దాదాపు 100 మందిని చంపేయగలదట. ఇంతకీ ఆ పాము ఏమిటీ? ఎక్కడ నివసిస్తోంది?

ఈ పాము ఒక్క కాటుతో 100 మంది చనిపోతారా?

ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే ఇన్‌ల్యాండ్‌ తైపాన్‌ అనే జాతికి చెందిన ప్రమాదకరమైన పాము.. ఒక్క సరి కాటు వేస్తే సుమారు వందమంది చనిపోతారట. దీని ఆకృతి కూడా మిగతా పాముల కంటే భిన్నంగా ఉంటుందట. అయితే ఈ పాము కేవలం ఉదయం సమయంలోనే చాలా హైపర్‌ యాక్టివ్‌ ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ నిపుణులు వెల్లడించారు. వీటి కోరలు సుమారు 3.5 నుంచి 6.2 మిల్లిమీటర్లు పొడవు ఉంటాయంటా. 


8. Inland TaipanGood news is Inland taipan snakes (dandarabilla) are reclusive, docile snakes unlikely to get aggressive with humans without cause. The bad news is that when people sneak up on inland taipans or try to handle them, they are well-equipped to defend themselves. pic.twitter.com/JhongCenfK

— AprokoRepublic 🇳🇬 (@aprokorepublic) October 31, 2022

News Reels

ఉసరవెళ్లిలా రంగులు మార్చే పాము

తైపాన్‌ పాముకు ఇంకో టాలెంట్‌ కూడా ఉంది. అదే రంగులు మార్చడం. అవును, మీరు చదివింది అక్షరాల నిజం. రుతువులను బట్టి.. ఈ పాము చర్మం రంగును ఈజీగా మార్చుకుంటుందని వెల్లడించారు సైంటిస్టులు. శీతాకాలంలో ముదురు గోధుమ రంగులో ఉండే ఈ పాము.. వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తుందట. ఇది ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. ఆ విషంతో 100 మందికి పైగా వ్యక్తులను, లేదా 2.50 లక్షల ఎలుకలను చంపొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇక పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని తెలిపారు. ఈ పాముల ప్రధాన ఆహారం కోడి పిల్లలు, ఎలుకలను మాత్రమే తింటాయట. ఉదయం సమయంలో మాత్రమే నేలపై ఉండి.. రాత్రి సమయంలో పెద్దపెద్ద రాళ్ల మధ్య ఉంటాయని తెలిపారు. అయితే ఈ ప్రపంచంలో దాదాపు 600 విషపూరిత పాములు ఉన్నప్పటికి.. కేవలం అత్యంత విషపూరితమైన పాములు దాదాపు 200 వరకు ఉన్నాయి. ఈ 200 పాముల్లోనే అత్యంత డేంజర్‌ పాము ఇదేనని తెలిపారు. 

Also Read: రొమ్ము క్యాన్సర్ మళ్ళీ తిరగబెడుతుందా? దాని లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button