News
Electricity Employee Swims In Floods For Repair: గ్రామానికి విద్యుత్ ఇవ్వడం కోసం సాహసం
<p>ఇంత వరదల్లో కూడా ప్రాణాలకు తెగించి ఇతను ఇలా ఎందుకు ఈదుకుంటూ వెళ్తున్నాడు అనుకుంటున్నారా..?! విధి నిర్వహణ కోసం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటం కోసం. తెలంగాణలో చాలా జిల్లాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సూర్యాపేటలోని పాతర్ల పహాడ్ గ్రామంలో కూడా అదే పరిస్థితి. ఆ ఏరియా అంతా ముంపునకు గురవంటో… విద్యుత్ వైర్లు తెగిపోయాయి. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగి…. సంతోష్ వానలకు, వరదలకు ఏమాత్రం వెనుకాడకుండా…. ఈదుకుంటూ … విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లాడు. తెగిపోయిన విద్యుత్ తీగలకు మరమ్మతు చేసి తిరిగి గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. అంతటి వరదలోనూ ఈదుకుంటూ వెళ్లిన అతడి తెగువను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.</p>
Source link