News
Cleaning Utensils: మాడిపోయిన గిన్నెలు తోమలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేస్తే క్షణాల్లో పాత్రలు మెరిసిపోతాయ్!
పండగ టైమ్ వచ్చేసింది. ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వంటగది సామాన్లు తోమడానికి రెడీ అయిపోతారు. వంట గది శుభ్రం చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. దాన్ని మరింత కష్టం చేసేది మాడిపోయిన గిన్నెలు, జిడ్డు, నూనె వదలని పాత్రలు. వీటి జిడ్డు వదిలించి, మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయాలంటే చేతులు నొప్పులు పుట్టేస్తాయి. కానీ ఎటువంటి కష్టం లేకుండా సింపుల్ గా వాటి జిడ్డు వదిలించే మార్గం ఉంది. టీవీ యాడ్స్ లో  రెండు చుక్కల డిష్ వాష్ తో అన్ని పాత్రలు కడగవచ్చో లేదో తెలియదు కానీ ఈ టిప్స్ పాటించారంటే మాత్రం మీ వంట పాత్రలు అద్దాల్లా మెరిసిపోతాయి.
ఉప్పు
ఉప్పు లేనిదే ఏ వంటకి రుచి రాదు. ఇది భోజనం రుచి పెంచడమే కాదు వంటగదిని శుభ్రం చేస్తుంది. జిడ్డుగా ఉన్న పాత్రని గోరు వెచ్చని నీటిలో పెట్టి అందులో కాసింత ఉప్పు వేసి ఒక గంట పాటు ఉంచాలి. అప్పుడు స్క్రబ్బర్  ఉపయోగించి తోమారంటే జిడ్డు త్వరగా వదిలిపోతుంది. పాత్రలని శుభ్రపరిచే మరొక మార్గం.. డిటర్జెంట్ ని ఉప్పులో కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలపై వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
బియ్యం నీళ్ళు, నిమ్మరసం
జిడ్డు లేదా మాడిన పాత్రలు వేడి బియ్యం నీటిలో నానబెట్టాలి. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ తీసుకుని దాన్ని తోముకోవాలి. ఈ మిశ్రమంలోని స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ మురికి, జిడ్డుని సులువుగా వదిలించేస్తాయి.
వెజిటబుల్ ఆయిల్
నూనె వల్లే జిడ్డు పడుతుంది. మరి నూనెతో జిడ్డు వదిలించడం ఏంటా అని ఆలోచిస్తున్నారా! కానీ ఇది చక్కని చిట్కా. వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించి జిడ్డు, మురికి, మాడిపోయిన పాత్రల్ని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. వేడి వేడి వెజిటబుల్ ఆయిల్ లో నిమ్మరసం, ఉప్పు, పంచదార వేసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాత్రల మీద పోసి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంత సేపు వాటిని నానబెట్టిన తర్వాత రఫ్ స్క్రబ్బర్ తో తుడిచేసి వేడి నీటితో కడగాలి. ఇలా చేశారంటే మరకలు లేకుండా మీ పాత్రలు మిలమిలా మెరిసిపోతాయి.
కొబ్బరిపొట్టు, వెనిగర్
ఇప్పుడు అయితే స్క్రబ్బర్ లు వచ్చాయి కానీ గతంలో అయితే బొగ్గు, కొబ్బరి పీచు వేసి అంట్లు తోముకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఆ చిట్కా బాగా పని చేస్తుంది. వెనిగర్, బేకింగ్ సోడా, వాషింగ్ సబ్బు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో కొబ్బరి పొట్టు నానబెట్టాలి. తర్వాత పాత్రని వేడి నీటిలో నానబెట్టి కొబ్బరి పిచ్చుతో స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. పాత్రలకి ఉన్న జిడ్డు చిటికెలో మాయం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ఈ చిట్కాలను ట్రై చేయండి.
Source link
Leave a Reply
Your email address will not be published. Required fields are marked *
Back to top button